దోమల నివారణకు చర్యలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట పట్టణంలో దోమల నివారణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ టి.వి. రంగారావు ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని 36 వార్డుల్లో దోమల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 100 లీటర్ల ఎం.ఎల్. ఆయిల్, ఆయిల్ బాల్స్‌ను పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పంపిణీ చేసి, ప్రతి వార్డులోని ప్రధాన, మధ్యస్థాయి డ్రైనేజీలలో పిచికారీ చేయించారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఎం.ఎల్. ఆయిల్ బాల్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు దోమల లార్వా నియంత్రణకు యాంటీ లార్వా రసాయనాలను పిచికారీ చేయించారు.ఇటీవల అర్నాబ్, మురుసు తుఫాన్ల కారణంగా పట్టణంలో పడిపోయిన, విరిగిపోయిన చెట్ల తొలగింపు, నీటి నిల్వల నివారణ, మురుగు కాలువల్లో అడ్డంకుల తొలగింపునకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మరమ్మతులకు గురైన వీధి దీపాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.వచ్చే శనివారం నాటికి పట్టణంలో పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో నిర్వహించడంతో పాటు వీధి దీపాల మరమ్మతులు, రోడ్లపై గుంతల పూడ్చివేత పనులు పూర్తి చేసి పట్టణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ డి ఈ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్లు దాసరి పవన్ అనూష లక్ష్మీ,టౌన్ ప్లానింగ్ అధికారి రమ్యశ్రీ,రెవెన్యూ ఆఫీసర్ మాచిరాజు రవి మేనేజర్లు శ్రీనివాస్, దంటు శ్రీనివాస్,శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు, శానిటరీ మేస్త్రీలు, శానిటేషన్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.