BREAKING
యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి

స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ

Select Suryaa Now
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో  6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ

న్యూఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 24 స్వచ్ఛ భారత్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటింది. వివిధ జనాభా కేటగిరీల ప్రాతిపదికన ఏపీ నగరాలు పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలిచాయి. 10 లక్షలకు పైగా జనాభా విభాగంలో విజయవాడ, విశాఖపట్నం అవార్డులు సాధించగా, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు, రాజమండ్రి పురస్కారాలు దక్కించుకున్నాయి. అలాగే 50 వేల నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి, 20 వేల నుంచి 50 వేల జనాభా విభాగంలో కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ అవార్డులకు ఎంపికయ్యాయి. చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడంలో, వ్యర్థాల సమర్థ నిర్వహణలో సాధించిన పురోగతికి గానూ ఏపీకి ఈ పురస్కారాలు దక్కాయి.