క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండల స్థాయి మాక్ అసెంబ్లీ కాంపిటీషన్‌లో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో మండపేటలోని సర్దార్ శ్రీ వేగుళ్ల వీర్రాజు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మండపేట మండలం తరఫున మొదటి, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
పాఠశాలకు చెందిన యు.వి.ఎన్.ఎస్. ప్రజ్ఞ, కె. దివ్య ధనలక్ష్మి ఈ ఘనత సాధించారు. వీరికి శిక్షణ అందించిన గైడ్ టీచర్ రామచంద్రారెడ్డి మాస్టర్‌ను, విజయం సాధించిన విద్యార్థినులను మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు, చింతా వెంకట సోమిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. గోపాలకృష్ణారెడ్డి అభినందించారు.
అలాగే పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.