మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
స్వాతంత్ర ఉద్యమంలో, విద్యారంగానికి కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని శ్రీ సత్యసాయి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. దేశంలో ఆధునిక విద్యకు, సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీలు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటుకు అబ్దుల్ కలాం బలమైన పునాదులు వేశారన్నారు.