సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు
టి.నరసాపురం,మేజర్ న్యూస్ :పంచాయతీ ఎన్నికల వేళ దేవరపల్లి ఆజాద్ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు, గ్రామంలోని ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధం కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, సేవాభావంతో ఆజాద్ స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆజాద్ పోటీలో ఉంటే ఇతర పార్టీల నాయకులు, గ్రామ ప్రజల నుంచి కూడా మద్దతు లభించే అంశంపై స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్టీ గుర్తింపుల కంటే వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధానికి ప్రాధాన్యతనిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆయన ఆలోచన ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు,