BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం

Select Suryaa Now
మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మాంస ఉత్పత్తుల విలువ ఆధారిత, సుస్థిర సంస్కరణపై రెండు రోజులు పాటు నిర్వహించే జాతీయ వర్క్ షాప్ ఘనంగా ప్రారంభమైంది.బుధవారం ఎస్వీ వెటర్నరీ సాంకేతిక విభాగం, హైదరాబాద్‌లోని ఇండియన్‌ మీట్‌ సైన్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా  యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ వైకుంఠరావు హాజరైడీన్ డా.ఆర్.వి.సురేష్ కుమార్, అసోసియేట్ డీన్ డా.పి.మాలకొండయ్య, రిజిస్ట్రార్ డా. ఆర్.వినూ, ఐసిఏఆర్ పూర్వ డైరెక్టర్ డా.ఎన్. కొండయ్య, పూర్వ డీన్ డా.ఎండి.నదీమ్ ఫైరోజ్, ఐఎంఎస్ఏ ప్రతినిధులుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం రెండు చారిత్రాత్మక ఘట్టాల కలయికగా నిలిచిందన్నారు. తిరుపతి వెటర్నరీ సైన్స్‌ కళాశాల ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు, ఇండియన్‌ మీట్‌ సైన్స్‌ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయన్నారు. మన మాంస ఉత్పత్తులు గణనీయంగా ఉన్నప్పటికీ, ప్రాసెస్సింగ్‌ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మాంసంలో ఎక్కువ భాగం తాజా, ప్రాసెస్‌ చేయని రూపంలోనే విక్రయించబడటం నిల్వ ఉండే ఉత్పత్తులు పరిమితంగా లభించడం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు విశ్వవిద్యాలయ దృక్పథం కేవలం తరగతి గదులు, డిగ్రీలకే పరిమితం కాదని, లాబ్‌–టు–ల్యాండ్, బెంచ్‌–టు–మార్కెట్‌ సాంకేతికతలను తీసుకెళ్లడమే తమ ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పశుసంపద కలిగిన దేశాల్లో ఒకటైనప్పటికీ, పోస్ట్‌–హార్వెస్ట్‌ విలువ ఆధారిత ఉత్పత్తులు 2% కంటే తక్కువగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో మాంస ఉత్పత్తుల ప్రాసెసింగ్, సహజ నిల్వ పద్ధతులు, ఆహార భద్రత, ఆధునిక ప్యాకేజింగ్, వ్యర్థాల రహిత వినియోగంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఆర్‌.వినూ మాట్లాడుతూ..పశుసంవర్ధక రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అనేది ఇకపై కేవలం ఆడంబరం కాదని అదొక ఆర్థిక, పోషకాహార అత్యవసర అవసరంగా మారుతుందన్నారు. వర్క్‌షాప్‌ కోఆర్డినేటర్,  ఎల్‌పీటీ విభాగాధిపతి డాక్టర్‌ జి.విజయ భాస్కరరెడ్డి మాట్లాడుతూ..పరిశోధనా ఫలితాలను వాణిజ్య సరళిలోకి తీసుకెళ్లి గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, నూతన పారిశ్రామికవేత్తలకు ప్రాసెస్సింగ్‌ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 60 మందికి పైగా ప్రతినిధులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్