అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా....
జిల్లా స్థాయి అండర్ 17 క్రీడా పోటీలు ప్రారంభం
ప్రారంభించిన డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత
క్రీడలతో మానసిక, శారీరిక ఉల్లాసం
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్.....
(కిరణ్ కుమార్ ఆరిక)
విద్యా శాఖను తన వద్ద ఉంచుకుని విద్యాశాఖలో నూతన విద్యా ప్రమాణాలతో విద్యకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ విద్యతోపాటు ఆటలలో కూడా తెలంగాణ విద్యార్థులు రాణించి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ అన్నారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని జ్యోతిరావు పూలే కుంచపర్తి పాఠశాలలో అండర్ 17 ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో జరిగే క్రీడలు పోటీలను ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ మట్ట దయానంద్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒక్కొక్క పాఠశాల నుండి 35మంది క్రీడాకారులు 12 పాఠశాలనుండి ప్రాతినిద్యం వహించనున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి క్రీడాకారుల కవాతు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేటి తరం విద్యార్థులు చదువుతోపాటు ఆటలు, క్రీడలల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీర దారుడ్యత పెంపొందిస్తుందని తెలిపారు. క్రీడల పోటీల్లో గెలుపు ఓటమి సహజమని చివరకు ఒక జట్టు గెలుస్తుందని ఓటమి అనేది గెలుపుకు మొదటి మెట్టు అని అన్నారు. విద్యావ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులతో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుందని అన్నారు. హాస్టల్లోని పిల్లలకు ఆహార మెనూలో మార్పులు చేసి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని వివరించారు. అనంతరం వాలీబాల్ క్రీడాకారులతో కలిసి ఆమె వాలీబాల్ ఆటను ఆడి క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, తాసిల్దార్ వీరభద్ర నాయక్, ఎంఈవో మోహన్ రావు, ఏపీఎం సంపత్ కుమార్, సీఐ సర్వయ్య, మండల పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమరాజు సీతారామారావు, కేసర శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు నారుమళ్ళ వెంకటేశ్వరరావు, కొప్పుల రమాదేవి, మాలోతు రాధాకృష్ణ, అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్, గూడూరు మాధవరెడ్డి, ఈడాకమలాకర్, బొర్రా కోటేశ్వరరావు, భుక్కా కృష్ణవేణి, వినీల, వంగ గిరిజాపతి, పాకాలపాటి సతీష్, మల్లెల రాజా, కోచ్ లు, పీఈటీలు, పాఠశాల అధ్యాపకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,