BREAKING
యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక

వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ–IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టులందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగుతూ వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా యూనియన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, వివిధ మండలాల నుంచి వచ్చే జర్నలిస్టులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు.జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోస్టల్ శాఖ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందేలా కృషి చేస్తానని వెల్లడించారు. వృత్తిపరమైన విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలతో పాటు వ్యక్తిగత ఇబ్బందుల్లోనూ జర్నలిస్టులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఏ జర్నలిస్టుకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, ఐక్యత కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని కొత్తపల్లి శ్రీధర్ తెలిపారు.