BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం

Select Suryaa Now
అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ స్టేడియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడల టోర్నమెంట్ కబడ్డీ పోటీలను బుధవారం రిజిస్ట్రార్ భూపతినాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ఎస్వీయూ పరిధిలోని సుమారు 12 కళాశాలల నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా ఎస్వీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వీయూ అంతర్ కళాశాలల మహిళా క్రీడలలో బుధవారం జరిగిన కబడ్డీ పోటీలలో మదనపల్లికు చెందిన జ్ఞానాంభిక డిగ్రీ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారని తెలిపారు. అలాగే టెన్నీస్ సింగిల్స్ లో శ్రీకాళహస్తి విక్రమ్ కళాశాల విద్యార్థిని, డబుల్స్ శ్రీకాళహస్తి ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని తెలిపారు. టేబుల్ టెన్సీస్ సింగిల్స్ లో శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, డబుల్స్ లో ఎస్వీయూ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని తెలియజేశారు

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్