BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ

Select Suryaa Now
కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ

నిర్మల్, సూర్య ప్రతినిధి :నిర్మల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ‘రైతు గర్జన’ బహిరంగ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చావు నోట్లో తలపెట్టైనా తెలంగాణ తెస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలే ఉండేవని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి బీడు భూముల్లో సాగునీరు పారించారని తెలిపారు. తుమ్మలు మొలిచిన కాకతీయ SRSP కాలువల్లో నీళ్లు పారించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు సాగునీరు, విద్యుత్, ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.