BREAKING
నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి

Select Suryaa Now
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం  -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా వర్సిటీలో జాతీయ విద్యా దినోత్సవం విద్యా విభాగం, ఎన్.ఎస్.ఎస్, ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యుమానిటీస్ బ్లాక్ లోని సెమినార్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా దేశ మొదటి విద్యా శాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వియూ రసాయన శాస్త్ర ఆచార్యులుప్రొ.వై.వి.రామిరెడ్డి హాజరై వికసిత్ భారత్ 2047, ఎన్ఈపి 2020 అనే అంశాలపై ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం-2020 ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విద్య పాత్రను ఆయన వివరించారు. ఎన్ఈపి-2020 విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్య కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి పునాది కావాలని సూచించారు. ప్రొ.పి.రేణుక అధ్యక్షత వహించగా, ప్రొ.టి.జి.ఆముదవల్లి మౌలానా ఆజాద్ జీవితం, సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఐ.సి. కన్వీనర్ ప్రొ. సి.హెచ్.ఎం.కుమారి, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.వై.అనిత (యూనిట్-16), డా. బేబీ ప్రసూన (యూనిట్-5), ప్రొ. జి. సునీతాభాయి, ప్రొ.వి.మాధవి, విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్