BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా

Select Suryaa Now
సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా

హైదరాబాద్ :కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బీలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్-ప్రియాంకలకు తల్లిగా సోనియా గాంధీ సాగించిన జీవిత ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను మరియు చేసిన త్యాగాలను ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీకి ప్రధాని కుర్చీపై ఎలాంటి వ్యామోహం లేదని, భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పీవీ నరసింహారావును, ఆ తర్వాత యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా ఎంపిక చేసిన ఘనత ఆమె త్యాగానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సినిమా నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిధులు సమకూరుస్తారని, త్వరలోనే 50 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.