BREAKING
రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థుల ఎంపిక... సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....! జాతీయస్థాయిలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు కూటమి విజేతలకు సత్కారం ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: స్పెషల్ స్ట్రే రౌండ్ తర్వాత కూడా చేరని విద్యార్థులు వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి

కీసర, మేజర్ న్యూస్: గోవర్ధన పూజను కీసరలో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శీర్వి సమాజ్ అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి తన నివాసంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా హంబాడ్ మోహన్ లాల్ చౌదరి మాట్లాడుతూ… గోవర్ధన పూజ గోసంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, పశుసంపద ప్రాముఖ్యతను చాటే పండుగ అని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గోకుల ప్రజలను, పశువులను భారీ వర్షాల నుంచి రక్షించిన ఘట్టానికి గుర్తుగా దీపావళి అనంతరం ఈ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గోవుల సంరక్షణతో పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో సమాజం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ పూజా కార్యక్రమాల్లో శీర్వి సమాజ్ మహిళా అధ్యక్షురాలు హంబాడ్ సుగి దేవి, చందు లాల్ చౌదరి, ఉజ్వల చౌదరి, దివ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.