ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్
కోహెడ ; కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో సిపి రష్మీ పెరుమాళ్ ఆదేశానుసారం హుస్నాబాద్ ఏసిపి సదానందం ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఇట్టి తనిఖీలలో దాదాపు 50 వరకు వాహనాల పత్రాలు తనిఖీ చేసి సరియైన పత్రాలు లేని వాటికి ఫైన్ లు విధించడం జరిగినది మరియు అక్రమంగా అమ్ముతున్న మద్యం ను కూడా సీజ్ చేయడమైనది, ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సదానందం గారు మాట్లాడుతు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీధర్ మరియు కోహెడ ఎస్సై అభిలాష్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్, కొమురవెల్లి ఎస్ఐ మహేష్ , మద్దూర్ ఎస్ఐ ఆసిఫ్, పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.