BREAKING
అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా.. సనత్ జయసూర్య సరసన చోటు! యశస్వి జైస్వాల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ డిమాండ్లు! యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్!

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Select Suryaa Now
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

కమలాపూర్, మేజర్ న్యూస్. విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో   మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ పాఠశాలలు,  కళాశాలల జిల్లాస్థాయి వార్షిక క్రీడా పోటీలు అండర్ -14, 17, 19 బాలికల విభాగానికి సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి  పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ క్రీడాంశాలలో పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి దోహదపడతాయని  పేర్కొన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి పేరును సాధించాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఎం జె పి హనుమకొండ జిల్లా డిసిఓ స్టెల్లా, కమలాపూర్ ప్రిన్సిపల్ సౌజన్య, ఉమ్మడి వరంగల్ జిల్లా డి సి ఓ లు, వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

రిపోర్టర్: పవన్, కమలాపూర్, హనుమకొండ జిల్లా