BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం!

Select Suryaa Now
వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సౌత్ ఇండియన్ సినిమా సంగీత ప్రపంచాన్ని తన చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ సహ యజమాని కావ్యా మారన్ అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా వీరిద్దరి వివాహం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట అత్యంత అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మరియు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విదేశీ గడ్డపై ఈ వివాహ వేడుక అత్యంత కమనీయంగా జరిగింది.  

గ్రీస్‌లోని ఒక సుందరమైన ప్రదేశంలో అద్భుతమైన వాతావరణంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోను స్వయంగా అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తన జీవితంలోని అత్యంత అరుదైన క్షణమిదని పేర్కొన్నారు. ఈ జంటకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సహచర సంగీత దర్శకులు, ప్రముఖ నటీనటులు ఘనంగా అభినందనలు తెలుపుతున్నారు. తమిళనాడు రాజకీయ ప్రముఖులతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ నూతన దంపతులను ప్రత్యక్షంగా ఆశీర్వదించినట్లు సమాచారం.

సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తున్న అనిరుధ్, మరోవైపు వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యాపారవేత్త కలధి మారన్ కుమార్తె, ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్యా మారన్ ఒకటగడం ప్రస్తుతం సినీ మరియు క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. గ్రీస్‌లో వివాహం పూర్తి చేసుకున్న ఈ కొత్త జంట త్వరలోనే చెన్నైలో అత్యంత భారీ స్థాయిలో రిప్సెషన్ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార, రాజకీయ మరియు సినీ దిగ్గజాలు హాజరుకానున్నట్లు సమాచారం.