BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

నూతన చౌక ధరల దుకాణం ఏర్పాటు

Select Suryaa Now
నూతన చౌక ధరల దుకాణం ఏర్పాటు

కమలాపూర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా  కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో చౌక ధరల దుకాణం ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మౌటం కుమారస్వామి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒడితల ప్రణవ్ బాబు గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన రేషన్ దుకాణం మర్రిపల్లి లో ఏర్పాటు చేయాలని ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రణవ్ బాబు కచ్చితంగా ప్రజల కోరిక నెరవేస్తానని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీ మేరకు రేషన్ దుకాణం మంజూరు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. మర్రిపల్లి గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం రేషన్ షాప్ మంజూరు చేయించి తరతరాలుగా గ్రామ ప్రజలుఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజల కోరికను నెరవేర్చారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందోత్సవాలతో మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇనుగాల రాజు, ఉప సర్పంచ్ తుమ్మల మమత రమేష్, యువజన కాంగ్రెస్ కమలాపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరాల రోహిత్ కుమార్,వార్డు సభ్యులు మారపల్లి రఘుపతి, తుమ్మల నరేష్,  నరెడ్ల శీను, యాటకాల రమేష్, ఇనుగాల మౌనిక తిరుపతి, ఇనుగాల పద్మ స్వామి,మర్రిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మల బుచ్చి మల్లు,మాజీ ఉపసర్పంచ్ తుమ్మల తిరుపతి, నాయకులు నరెడ్ల స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల సంతోష్, యాటకాల రాజు, బూర్గుల స్వామి, నన్నే నరసింహస్వామి, తుమ్మల రాములు,గంధసిరి అనిల్  గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్, పవన్ ,కమలాపూర్, హనుమకొండ జిల్లా