దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే
అయినవిల్లి మేజర్ న్యూస్ :ప్రజల సౌకర్యార్థం కొట్లు ప్రజాధనంతొ నిర్మిస్తున్న రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటగా నిలిచాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా సిరిపల్లి గ్రామం నుండి ముమ్మిడివరం మండలం అనాథవరం వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని రెండు సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ వేసిన ఆరు నెలలకే గోతులు పడిపోయాయి వెంటనే ప్యాచ్ వర్క్ చేసి చేతులు దులుపుకున్నారు ప్రస్తుతం రోడ్డు పొడుగునా గోతులు పడి వర్షపు నీటితో నిండిపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కా oట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా నిర్మించడంతో కోట్లు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకపోతుంది
ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు నిర్మించకపోవడంతో సంవత్సరం తిరక్కుండానే శిధిలమవుతున్నాయి ఆర్ అండ్ బి అధికారులు ఈ రోడ్డును నిర్లక్ష్యం చేశారని విమర్శలు వస్తున్నాయి సిరిపల్లె వద్ద కిలోమీటర్ రోడ్డు వెడల్పు చేయకుండా నిర్మించడంతో వెంట వెంటనే శిధిలమైంది అయినవిల్లి మండలం మరియు ముమ్మిడివరం మండలం మధ్య ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గానికి రాకపోకలు అధిక సంఖ్యలో వాహనాలు ఉంటాయి రోడ్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి సక్రమంగా నిర్మించాలని ప్రజలకు కోరుతున్నారు