పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ.
పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. యస్. ఐ.
సూర్య న్యూస్ ముండ్లమూరు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గొడవలు పడి కేసులు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్ఐ పి కోటేశ్వరరావు ప్రజలకు సూచించారు. మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజల సహకరించాలని ఆయన కోరారు. చిన్న చిన్న విషయాలు పాత గొడవలు మనసులో పెట్టుకొని గొడవలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.
పంచాయితీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎటువంటి గొడవలు పడొద్దని ప్రజలకు ఎస్ఐ సూచించారు.