ఆజాద్ సేవలు చిరస్మరణీయం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరందేశంలో విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన గొప్ప వ్యక్తిభారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు.బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని వాడపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని విద్య ద్వారానే సమాజంలో సమానత్వం,అభివృద్ధి సాధ్యమవుతాయని విశ్వసించిన ఆయన దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.ఆయన దూరదృష్టి,విద్యారంగానికి చేసిన కృషి నేటి భారతదేశ విద్యాభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు.దేశ ఐక్యత,విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన ఆజాద్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ముఖ్యంగా నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ షరీఫ్,షేక్ సంధాని,గుబ్బల మూర్తి,గంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అక్కిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.