BREAKING
ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్....

రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

నరసరావుపేట :జిల్లాలో రహదారి ప్రమాదాలను, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్.హెచ్167ఏ , ఎన్.హెచ్ 544డి  జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణాలను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గుర్తించిన 34 బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై అవసరమైన చోట లైటింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారి భద్రతా లోపాలను గుర్తించి గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు. ఇంజినీరింగ్ మార్పులు, వేగ నియంత్రణ, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లోనే వైద్య సహాయం అందించాలని, 108 అత్యవసర సేవలను మెరుగుపరచా లని తెలిపారు. పీఎం రహత్  పథకం అమలుపైనా సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే రహదారి భద్రతా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ప్రమాదాల నివారణ ప్రతి శాఖ బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ జగదీశ్, రవాణా శాఖ జిల్లా అధికారి సంజీవ్ కుమార్, వివిధ శాఖల అధికారు లు పాల్గొన్నారు.

 మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..