BREAKING
యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం

దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు

 కోహెడ ; ఇందూర్తి మాజీ శాసనసభ్యులు దేశిని చిన మల్లయ్య గౌడ్ 9వ, వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ బందెల సుజాత - బాలకిషన్ హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా సాయికృష్ణ హాస్పటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…దేశిని చిన మల్లయ్య గౌడ్ ఈ ప్రాంతానికే కాకుండా,యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మల్లయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు.నిరాడంబరంగా జీవనం సాగించి సిపిఐ పార్టీ కి చిన్న మల్లయ్య విశిష్ట సేవలు అందించారని రాజు అన్నారు. దేశిని చిన్న మల్లయ్య పేరు మీదుగా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశ పెట్టీ  ఈ ప్రాంతానికి సేవలందించాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి రాజు విజ్ఞప్తి చేశారు. దేశిని చిన్న మల్లయ్య వారసుడిగా తన ఆశయాలను కొనసాగిస్తానని రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ముంజ ప్రకాష్ గౌడ్, రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ ఆటోయూనియన్ అధ్యక్షులు పి.చంద్రయ్య,ఏస్ రమేష్, శ్రీనివాస్ కాయిత రామ దాస్,మహిళా సంఘం నాయకులు మంజుల గౌడ్,మౌనిక,వాసాల సంపత్, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు షేక్ గోరిమియా, లాల్ తదితరులు పాల్గొన్నారు.