BREAKING
విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ. ప్రమాణ స్వీకారం చేయకనే.. తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ జానకమ్మ

నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Select Suryaa Now
నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

కీసర, మేజర్ న్యూస్ : మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని నాగారం డివిజన్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బుధవారం పర్యటించారు. ప్రజాసాయి గార్డెన్ పరిధిలోని శివశంకర్ కాలనీ, సాయినగర్ కాలనీతో పాటు పలు కాలనీల్లో పర్యటించి, ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.కోటి విలువైన డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ, రహదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను త్వరలో పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడుపుతోందని విమర్శించారు. రోజుకో శంకుస్థాపన, పూటకో ప్రారంభోత్సవం చేస్తున్నారని, శిలాఫలకాలు కనిపిస్తున్నాయే తప్ప అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సంక్షేమ పథకాల అమలులోనూ ప్రజలకు నిరాశే మిగిల్చిందని ఆరోపించారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.ఈ పర్యటనలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి, కీసర డిప్యూటీ కమిషనర్ రామలింగం, మాజీ దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, నాగారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, దమ్మాయిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కౌకుట్ల అనంతరెడ్డి, వసుపతి రమేష్ గౌడ్, మంగళపురి వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి, నిమ్మల శ్రీను, గూడూరు ఆంజనేయులు గౌడ్, సాయి గౌడ్, భాస్కర్, శ్రీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.