జాతీయస్థాయిలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు
కుప్పం, మేజర్ న్యూస్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణానికి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో భాగంగా కుప్పం పురపాలక సంఘం జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకోవడం పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ ఈ అవార్డును అందుకున్నారు. కుప్పం పురపాలక సంఘం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషనర్ శ్రీనివాసరావును మున్సిపల్ చైర్మన్ సెల్వ రాజును వారి సిబ్బందిని అభినందించారు పురపాలక సంఘం అధ్యక్షులు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ శ్రీనివాసరావుకు సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచిన పట్టణాలు, నగరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులతో సత్కరిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కుప్పం పురపాలక సంఘం తాజాగా జాతీయస్థాయిలో అవార్డు సాధించడం విశేషంగా నిలిచింది. రాష్ట్రస్థాయి గుర్తింపు నుంచి జాతీయస్థాయి పురస్కారం వరకు కుప్పం పురపాలక సంఘం ప్రస్థానం పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణలో సాధించిన పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ విజయంతో పురపాలక సంఘం సిబ్బందిలో నూతన ఉత్సాహం నెలకొనగా, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కుప్పం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ పురపాలక సంఘం సిబ్బందికి అభినందనలు తెలిపారు ప్రస్తుత ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన కాబోయే మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ మున్సిపల్ సిబ్బందిని అభినందించారు వెల్లువెత్తుతున్నాయి.
చలపతి, కుప్పం నియోజక వర్గం ఇంచార్జి.