BREAKING
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం...

Select Suryaa Now
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం...

దుబ్బాక …నియోజక వర్గ పరిధిలోని 
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని తాల్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూరైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన రహదారులు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం  గ్రామాల అభివృద్ధి  ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెరుకు శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అక్బర్ పేట భూంపల్లి మండలం అధ్యక్షులు గుండా శంకర్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, తిప్పన బోయిన పున్నవ్వ, జిల్లా ప్రధాన ఎల్లనగారి సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రదీప్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతురి వెంకటస్వామి గౌడ్, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, నగరం ఉపసర్పంచ్ జీడిపల్లి రమేష్, బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చందు, తాళ్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరపు ఎల్లం, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోలిపేట ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్ గడ్డం యాదగిరి, గోపారీ నర్సింలు, గోపరి రమేష్, వేల్పుల యాదయ్య, తిప్పన బోయిన స్వామి, బొమ్మెర శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.