BREAKING
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ.

టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Select Suryaa Now
టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

చౌడాపూర్, మేజర్ న్యూస్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చేస్తున్న కృషి అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టీ. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ టీ. రితిక్‌ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.ఈ హెల్త్‌ క్యాంప్‌లో మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మొత్తం 733 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే, నాయకులు వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా భవిష్యత్తులోనూ ఇలాంటి ఉచిత మెగా హెల్త్‌ క్యాంపులను వివిధ గ్రామాల్లో నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ టీ. రితిక్‌ రెడ్డిని పలు గ్రామాల ప్రజలు, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.