BREAKING
"రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ. ప్రమాణ స్వీకారం చేయకనే.. తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ జానకమ్మ బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా వర్సిటీలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ బ్యూరో, యూనిట్ ఆధ్వర్యంలో  బయోటెక్నాలజీ విభాగం సహకారంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే ఆర్ పద్మ, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐవీ లలిత కుమారి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ బి.కిషోరి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ పి. జోత్స్న, డా.ఎం.శంకరి పాల్గొన్నారు. ముఖ్య వక్తలుగా నైజీరియాలోని ఇజెబు-ఓడే, తాయ్ సోలారిన్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఒలుముయివా బమిడెలే అలబా డా. మోసెస్ అడెలౌ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో విద్య పాత్ర, నాణ్యమైన సమ్మిళిత విద్య ఆవశ్యకతను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, డిజిటల్ అక్షరాస్యత, బోధన-అభ్యసన ప్రక్రియలో నూతన ఆవిష్కరణల సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆవిష్కరణలు, స్వయం ఉపాధి, పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలు, స్వతంత్ర ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్