BREAKING
ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థుల ఎంపిక... సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....! జాతీయస్థాయిలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు కూటమి విజేతలకు సత్కారం ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: స్పెషల్ స్ట్రే రౌండ్ తర్వాత కూడా చేరని విద్యార్థులు వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి రేపు చాపల చెరువుకు జలహారతి... భారీ సంఖ్యలో హాజరుకానున్న మహిళలు, రైతులు. నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం

ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి

Select Suryaa Now
ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి

 

*భైరవుని బండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి*

*సూర్య మేజర్ న్యూస్ ,శాలిగౌరారం*
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని డిఆర్డిఏ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని భైరవునిబండ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ నరిగే యాదయ్య తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం మద్దతు ధరను పెంచిందని తెలిపారు.A గ్రేడు ధాన్యానికి క్వింటాల్ కు 2461 రూపాయలు,సాధారణ రకం ధాన్యానికి 2441 రూపాయలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు తమ ధాన్యాన్ని తూర్పారబట్టి తేమ శాతం 17 లోపు ఉండేలా శుభ్రం చేసి తీసుకురావాలని,టోకెన్ విధానంలో సీరియల్ క్రమాన్ని పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  వైస్ చైర్మన్ నరిగే నరసింహ గారు,ఏపీఎం శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింత ధనుంజయ,ఉప సర్పంచ్ దండ శ్రీలత కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్ నరిగే శoబయ్య,ఏపీవో జంగమ్మ,మండల సమైక్య అధ్యక్షురాలు మోదుగు అండాలు,సీసీ యశోద,శాంత,వివో ఏ శంకరయ్య,దేవస్థానం చైర్మన్ దండ యాదగిరిరెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు..

ఫోటో రైటప్:
బైరవుని బండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి, సర్పంచ్ తదితరులు...