40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత..
*40వ వార్డులో డ్రైనేజీల శుభ్రత పనులు.. కూటమి ఇంచార్జ్ మరియమ్మ చక్రవర్తి (చక్రి) చొరవ*
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు కూటమి సూచనల మేరకు 40వ వార్డు పరిధిలోని పలు కాలనీలలో మరియు పరిగి రోడ్ నందు డ్రైనేజీల శుభ్రత పనులు చేపట్టారు.
కూటమి 40వ వార్డు ఇంచార్జ్ మరియమ్మ చక్రవర్తి (చక్రి) చొరవతో మున్సిపల్ సిబ్బందిచే డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా చక్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సూచనల మేరకు వార్డులో పారిశుధ్య సమస్యలు లేకుండా చూస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.
డ్రైనేజీలు శుభ్రం చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ నాగరాజు, హిందూపురం