ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు
పార్వతీపురం, సూర్య : భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి ని పురష్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీల సంక్షేమ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత ముఖ్య అతిధి గా హాజరై మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారిని పి. సునీత, మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది బధరినాధ్, ఇంతియాజ్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.