BREAKING
చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా....

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు 

ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వంగా.వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ ఫణికుమార్, హెలాపురి బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూచిపూడి సత్యనారాయణ, నిర్వహణ కార్యదర్శి గుడాపాటి.నరసింహారావు  కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని నమ్మిన ఆయన, దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని విద్య, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్  కె.హరిబాబు, కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.