BREAKING
నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు

పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన

Select Suryaa Now
పొన్నూరు మండలం   సీతారాంపురం  స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన

 పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండలం లో స్వర్ణ గ్రామంగా ఎంపికైన సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన శిబిరాన్ని కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారులు సందర్శించి పలు అభివృద్ధి వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సలహాదారులు  సంపా బాసు, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్  అనూరాధ పంచాయతీరాజ్ కమిషనర్  ఓఎస్డీ త్రినాథ్ రెడ్డి కమిషనర్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్  డి. మల్లేశ్వరి జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయికుమార్, డిప్యూటీ సీఈవో కృష్ణ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ  ఇ. అన్నపూర్ణ, పాండ్రపాడు వైద్యాధికారి  పి. హేమలత, గుంటూరు డీఎల్డీవో  తూమాటి సుధారాణి, తెనాలి డీఎల్పీవో  వి. స్వరూపరాణి  మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుమ్మా చంద్రశేఖర రావు, సీడీపీవో  సి.హెచ్. ఉమామహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో వేముల శ్రీనివాసరావు, ఏపీవో సుభాషిణి, ఏపీఎం జోజిబాబు పాల్గొన్నారు.శిబిరంలో ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చిత్రపటాలకు  పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు . అనంతరం సీతారాంపురంకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఫోటోలు, వివిధ శాఖల స్టాల్స్, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.తదుపరి సచ్చరథం, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, 104, 108, సంచార పశు వైద్యశాల ద్వారా అందుతున్న సేవల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను సందర్శించి ప్రజలకు అందుతున్న అధునాతన వైద్య సేవలను పరిశీలించారు. "మీ గ్రామం మా బాధ్యత" అనే నినాదాన్ని విధానంగా చేసుకుని వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.యోగా కేంద్రాన్ని సందర్శించి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చేసిన యోగాసనాలను పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్లను వ్యర్థాల సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద వనాన్ని పరిశీలించి అందించిన మొక్కల గురించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం "మీ ఆరోగ్యం మా బాధ్యత" కింద అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో గృహాలను సందర్శించి ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీబీజీ రామ్ జీ పథకం కింద వ్యక్తిగతంగా నిర్మించుకున్న సోక్ పిట్స్ ను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది నిర్వహిస్తున్న పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్