BREAKING
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థుల ఎంపిక... సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....! జాతీయస్థాయిలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు కూటమి విజేతలకు సత్కారం ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: స్పెషల్ స్ట్రే రౌండ్ తర్వాత కూడా చేరని విద్యార్థులు వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి రేపు చాపల చెరువుకు జలహారతి... భారీ సంఖ్యలో హాజరుకానున్న మహిళలు, రైతులు. నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ

జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు

Select Suryaa Now
జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు

పటాన్‌చెరు,; భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత ఎన్నికల ప్రక్రియపై క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ మాట్లాడుతూ యువత అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసానికి ప్రాధాన్యతనిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సమాజంలో విద్యకు దూరంగా ఉన్న వారికి విద్యా అవకాశాలు కల్పించడంలో డిగ్రీ విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో భారత ఎన్నికల ప్రక్రియపై క్విజ్ పోటీ నిర్వహించి విద్యార్థుల్లో ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రొఫెసర్ వెంకటేశం ఆకుల, డాక్టర్ కరుణకుమారి, చరిత్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ దశమ్మ తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.