BREAKING
రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థుల ఎంపిక... సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....! జాతీయస్థాయిలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల టీఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు కూటమి విజేతలకు సత్కారం ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: స్పెషల్ స్ట్రే రౌండ్ తర్వాత కూడా చేరని విద్యార్థులు వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ నాగారం డివిజన్‌లో రూ.కోటి డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం *

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు   * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం *

మెళియాపుట్టి, సూర్య : గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై బుధవారం మెళియాపుట్టి మండల వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ రాము, ఎంపీడీవో పి. నరసింహప్రసాద్ పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు.
గ్రామపంచాయతీల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, అవసరమైన సదుపాయాల కల్పన, అధికారుల విధుల కేటాయింపు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ సహాయకులు, ఇంజినీరింగ్ సహాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి కీలక బాధ్యత వహించాలని, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ సహాయకులు, ఇంజినీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.