రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ...
నరసన్నపేట, సూర్య : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసన్నపేట నియోజకవర్గ స్థాయి విద్యార్థుల పోటీలు బుధవారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (GHS)లో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు, ఎంఈఓ-2 పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు.
విజేతల వివరాలు:
* ప్రథమ స్థానం: పి. సూర్య – జెడ్పీహెచ్‌ఎస్, కంబకాయ.
* ద్వితీయ స్థానం: డి. ప్రణతి – జెడ్పీహెచ్‌ఎస్, శ్రీముఖలింగం.
* తృతీయ స్థానం: బి. భువన శృతి – జెడ్పీహెచ్‌ఎస్, కంబకాయ.
ఈ ముగ్గురు విజేతల్లో ఒకరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే విద్యార్థి మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.