చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి
*తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి*
మేజర్ న్యూస్,శాలిగౌరారం* గ్రామీణ ప్రాంత ప్రజలు తెలంగాణ గ్రామీణ బ్యాంకును వినియోగించుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని చిత్తలూరు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, రైతులకు, ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయడమేలక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు అన్ని రకాల లోన్స్ తో పాటు,చిన్న తరహా వ్యాపారాలకు,నూతన వాహనాల కొనుగోలు కు,విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ తదితర లోన్స్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు అందిస్తుందని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ గిరగాని వెంకన్న,మాజీ సర్పంచ్ బొమ్మగాని రవి,రీజనల్ మేనేజెర్ కె.శివ కుమార్,అడ్వాన్స్ మేనేజర్ కరుణాకర్ రెడ్డి,సీనియర్ మేనేజర్ సిహెచ్ వెంకటేష్,బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అలుగుబెల్లి అజయ్,క్యాషియర్ తాళ్లపల్లి రవికుమార్,జబ్బార్,1 వార్డు సభ్యురాలు పీర్నాయకం సునీత,పీర్నాయకం రమేష్,దాసరి దేవ చిత్తం,ఎర్ర రాజు, బ్యాంకు సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
చిత్తలూరు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను ప్రారంభిస్తున్న స్టేట్ చైర్మన్ ప్రతాపరెడ్డి..