BREAKING
ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల! మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు శిక్షణ తరగతులు క్షేత్రస్థాయి అమలకు కృషి చేయాలి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్

దోమ, మేజర్ న్యూస్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శాంత్ కుమార్ అన్నారు. దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామంలో చాపల శ్రీనివాస్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాంత్ కుమార్‌తో పాటు రాకొండ మాజీ సర్పంచ్ చాపల వెంకటయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శ్రీకాంత్ రెడ్డి, విద్యాసాగర్, నర్సప్ప తదితరులు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.తమ సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు సొంతింటిని అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమకు అండగా నిలిచిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను లబ్ధిదారులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు కొత్త చంద్రయ్య, చాపల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.