BREAKING
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే తాగునీటి కష్టాలు ఇక నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి

Select Suryaa Now
ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే తాగునీటి కష్టాలు ఇక నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన తాగునీరు కూడా అందని దుస్థితి నెలకొంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సొంత గ్రామమైన పంచగామలోనే ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా రావాల్సిన తాగునీరు సక్రమంగా అందడం లేదు. దీంతో గ్రామానికి దూరంగా ఉన్న బోరు నుంచి నీటిని తీసుకొచ్చి, గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామానికి అందించిన ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ ద్వారా రెండు మూడు రోజులకు ఒకసారి ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేసిన పథకాలు నేడు ఎందుకు సక్రమంగా పనిచేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగూరు జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ప్రజల అవసరాలకు సక్రమంగా వినియోగించలేకపోవడం, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి లేదా ప్రజలు నీటి కోసం బిందెలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి రావడం పాలకుల వైఫల్యం కాదా ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే సొంత గ్రామమైన పంచగామలోనే తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా ఉంటే, ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజల కనీస అవసరాలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. అభివృద్ధి పేరుతో ప్రచారాలు చేసుకోవడం కాదు.. ప్రజల గొంతు తడిపే తాగునీరు అందించడం నిజమైన అభివృద్ధి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పాలకులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కళ్లు తెరిచి పంచగామ గ్రామంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించి, సింగూరు జలాలను ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలనీ వారన్నారు