BREAKING
మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా

12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి

Select Suryaa Now
12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి

కుల్కచర్ల, మేజర్ న్యూస్ : రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు అండగా నిలుస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది రైతులకు రూ.73 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆర్థిక ప్రగతికి వివిధ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, కాంగ్రెస్ బ్లాక్-2 అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, జిల్లా యువ నాయకుడు కుమ్మరి స్వామి, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు శివరాం నాయక్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.