BREAKING
నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు

పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు

Select Suryaa Now
పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు

 ఆత్మకూరు, మేజర్ న్యూస్:  ఆత్మకూరు మండలంలోని పంటలు సాగు చేసిన, చేయబోతున్న రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కే. కిషోర్ బాబు కోరారు. ఆయన బుధవారం మండలంలోని కరటంపాడు, బోయళ్ళ చిరువెళ్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా క్షేత్ర పరిశీలన గావించారు.అనంతరం కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత రభీ సీజన్లో వరి, పచ్చిశనగ, మినుము, వేరుశనగ,పెసర సాగుచేసిన మరియు చేయబోతున్న రైతులు తప్పకుండా పంటల బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలన్నారు. వరి పంటకు 168 రూపాయలు, పచ్చిశనగకు 56 రూపాయలు, మినుముకు 38 రూపాయలు, వేరుశనగకు 60 రూపాయలు,పెసర పంటకు 36 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. ఎల్ నినో వాతావరణం లేదా కరువు లేదా అధిక వర్షం ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగుబడి తగ్గిన నష్టపోయిన భీమా రక్షణ పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీలోగా వరి రైతులు, డిసెంబర్ 15 లోగా ఇతర పంటల రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలని కిషోర్ బాబు సూచించారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, వేరుశనగ,వర్షాధారంగా జొన్న,పెసర,నువ్వుసాగు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఏ ఏ లు ఎస్ మంజుల,లక్ష్మీలహరి, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.