పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి...
సీతానగరం, సూర్య : మండలంలో ఎంపీటీసీ /జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లు వద్ద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టిన నిధులను తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అప్పలనాయుడు. ఎంపీడీవో ఎంఎల్ఎన్ ప్రసాద్ కు సచివాలయ కార్యదర్శులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ఎంపీటీసీ .జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా 4 .5 తేదీలలో పెట్టిన ఖర్చులను త్వరగా మంజూరు చేయాలని కోరడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు పి. శశిభూషణ్. కామేశ్వరరావు. మురళి. ధనలక్ష్మి . శ్రీలక్ష్మి. గౌరీశ్వరి తో పాటు పలువురు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.