BREAKING
నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు

పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్

Select Suryaa Now
పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్

మేడ్చల్, మేజర్ న్యూస్ : పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ అధికారులను కోరారు. పట్టణంలో జనాభా, రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ముఖ్యంగా మేడ్చల్ బస్ డిపో సమీపంలోని హైవే పక్కన, మేడ్చల్ చెక్‌పోస్ట్, పూడూరు, కిష్టాపూర్ ప్రాంతాల్లో ఆధునిక మోడల్ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వస్తుంటారని, మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి తగిన సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా మేడ్చల్ ఎన్జీవోస్ కాలనీలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని, కాలనీలోని రెండు గల్లీల్లో నూతన సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ మేరకు సీఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్‌ను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసి వినతిపత్రం అందజేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్రుద్దీన్, మాజీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ నాగరాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు.