టిపిటిఎఫ్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మునిపల్లి, : టిపిటిఎఫ్ మునిపల్లి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం మండల పరిధిలోని పెద్దగోపులారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టిపిటిఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన మండల టిపిటిఎఫ్ కార్యవర్గం ఎన్నిక వివరాలు ఇలా ఉన్నాయి. మండల టిపిటిఎఫ్ అధ్యక్షులు నీలి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, జిల్లా కౌన్సిలర్ లు గోవర్ధన్, ముజాఫర్‌ఉద్దీన్, సంతోషమ్మ, అమీన్‌ఉద్దీన్,
నాగేశ్వర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం పొరాటం చేస్తానని తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.