కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు
మర్రిపాడు, మేజర్ న్యూస్: ఆ గ్రామం పారిశుద్ధ్యంతో నిండిపోయింది. ఎటు చూసినా వర్షపు నీరు అంతర్గత రహదారుల్లో చేరి నివాసాల ముందే నిలిచిపోయింది. డ్రైనేజీ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు పదేపదే చెబుతున్న పట్టించుకోవడంలేదని వాపు ఒక తప్పడం లేదు. ఫలితంగా ప్రస్తుత సీజన్లో వ్యాధుల బారిన పడక తప్పడం లేదు. విశేషమేమిటంటే ప్రాథమిక పాఠశాల ముందు కూడా పారిశుధ్యం తాండవిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అదే మర్రిపాడు మండలంలోని కంపసముద్రం ఎగవూరు గ్రామం. వివరాల్లోకి వెళితే..
మర్రిపాడు మండలంలోని కంపసముద్రం ఎగవూరు గ్రామం పారిశుద్ధ్యంతో తాండవిస్తోంది. ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాల కారణంగా గ్రామంలోని అంతర్గత రహదారులు వర్షపు నీటితో పారిశుద్ధ్యంగా మారి అద్వాన్నంగా తయారయ్యాయి. దీంతో ఆ పారిశుద్ధ్యంను తొలగించకపోవడంతో వాటిపై ఈగలు దోమలు క్రిమి కీటకాలు వాలి గ్రామస్తులును పలు వ్యాధులకు గురి చేస్తున్నాయి. పాలకులు అధికారులు కనీసం బ్లీచింగ్ చల్లిన పాపాన కూడా పోలేదు. దీంతో నివాసాల ముందే మరుగు ఏర్పడి వ్యాధులకు తావిస్తోంది. ప్రత్యేకించి ఆ రహదారుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కనీసం వర్షపు నీరు పోయేందుకు కూడా తగు చర్యలు తీసుకోకపోవడంతో రహదారుల్లో మరుగు ఏర్పడి వ్యాధుల బారిన పడక తప్పడం లేదని వాపుతున్నారు. అంతేకాకుండా ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ముందే పారిశుద్ధ్యం తాండవిస్తున్న కనీసం విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పారిశుద్ధ్యం వల్ల విద్యార్థులు వ్యాధుల బారిన పడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆ పాఠశాల ఆవరణంలోనే త్రాగునీరు భోజనం చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఆ మరుగు మీద ఉన్న క్రిమి కీటకాలు భోజనం మీద వాలి వ్యాధులకు గురి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు పట్టించుకోని గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా మరుగును తొలగించి వ్యాధుల బారి నుండి కాపాడాలని కోరుతున్నారు.