BREAKING
నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు

మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర

Select Suryaa Now
మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర

సూర్య - మానకొండూర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 18న చేపట్టనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, బుధవారం మానకొండూరు మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో పార్టీ మండల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. మండలం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. జన సమీకరణ, రవాణా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్, ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, శంషాబాద్ ఉప సర్పంచ్ డొల్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, శీలం కుమార్, సీనియర్ నాయకులు సొన్నకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్, మీస రమణయ్య, కార్యదర్శులు కోల శ్రీనివాస్, రావుల తిరుపతి, ఆరపెల్లి సునంద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అడప రవి, తదితరులు హాజరయ్యారు.