సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి
సిద్దిపేట, ; ఈనెల 19న సిద్దిపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని కలెక్టర్ హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సభ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. నాగదేవత గుడికి సమీపంలో గల సీఎం బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని, హెలిప్యాడ్ ను సందర్శించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సభ ప్రాంగణంలో వేదిక, విఐపి లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మీడియా కోసం ఏర్పాటు చేయవలసిన ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీఐపీలు, అధికారుల వాహనాల పార్కింగ్, బందోబస్తు నిర్వహణ, ఈ బహిరంగ సభకు హాజరయ్యే భారీ సంఖ్యలో జనాలకు త్రాగునీరు, ఇతర వసతులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రత్యేక గ్యాలరీల భారీ కేడింగ్, విద్యుత్ సౌకర్యానికి ఇబ్బంది కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.