ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి: టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ
సంగారెడ్డి ; ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి వారి ఆకాంక్షలను నెరవేర్చాలని టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.డి. జావీద్ అలీ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జిల్లా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పక్క రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర సంఘం ఇచ్చే ప్రతి పిలుపునకు జిల్లా శాఖ ముందుండి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు నాయకులుఈ సమావేశంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉమా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.7సంగారెడ్డి జిల్లా తరఫున జిల్లా కార్యదర్శి వేల్పూరు రవి, కేంద్ర సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల రాజ్ కుమారి రాథోడ్, కేంద్ర సంఘం బాధ్యులు గౌస్ హష్మీ తదితరులు పాల్గొన్నారు.