ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్..
అమీన్ పూర్ ; అమీన్ పూర్ జిహెచ్ఎంసి డివిజన్ పరిధిలోనీ ప్రధాన రహదారి ఎంతోకాలంగా ఎదురవుతున్న రావాన, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పాలన యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
అందులో భాగంగా స్థానిక ప్రధాన రహదారిని సిఎంసి కమిషనర్ జి. సృజన స్వయంగా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనదారుల తిప్పలు, ట్రాఫిక్ నివారణ పై దృష్టి అమీన్పూర్ ప్రధాన రహదారి రోజు రోజుకు పెరుగుతున్న వాహన రద్దీకి సరి పోకపోవడం కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తినడం మరియు అక్రమనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యలపై తక్షమే స్పందించిన సిఎంసి కమిషనర్ సుజన పాదాచార్యులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గుర్తించారు.
రోడ్డు పనులను త్వరి తగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.