మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
నరసరావుపేట : రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించేందుకు పల్నాడు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ (అడ్మిన్) ఆధ్వర్యంలో బుధవారం నరసరావుపేట పట్టణంలో ఈ కవాతు చేపట్టారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ వరవకట్ట మీదుగా మార్కెట్, మల్లమ్మ సెంటర్, క్లాక్‌టవర్ మీదుగా తిరిగి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేం దుకు పోలీసు శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు, ఎన్నికల సమయంలో శాంతిభద్రత లకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే సంకేతాన్ని పోలీసులు పంపించారు. ఈ కార్యక్రమం లో నరసరావుపేట వన్‌టౌన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..