శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయు లు కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల శ్రీవేంకటే శ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకు న్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదా లను అందజేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు వినుకొండ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషా లతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ని ప్రార్థించినట్లు తెలిపారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి